‘సర్కారు వారి పాట’ సూపర్ మాస్ అప్ డేట్..!

Thaman S Gives An Update About Sarkaru Vaari Paata,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Thaman S,Music Composer Thaman S,Thaman s Latest Updates,Thaman Mass Update,Thaman About Sarkaru Vaari paata updates,Thaman Sarkaru Vaari Paata Movie Updates, Thaman Mass Update About Sarkaru Vaari paata movie,Thaman latest Updates About Sarkaru Vaari Paata Movie,Thaman Upcoming Movies

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈసినిమా కోసం మహేష్ అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో ఈసినిమాపై వస్తుండటంతో ఈసినిమా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా ఒక వైపు షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుంటుంది. మే నెల 12వ తేదీన ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసి అప్ డేట్స్ ఇస్తూ అభిమానుల్లో ఇంకా క్యూరియాసిటీ పెంచుతున్నారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి రిలీజ్ అవుతున్న పాటలు కూడా సినిమాపై మరింత క్రేజ్ ను పెంచుతున్న సంగతి తెలిసిందే. మరోసారి థమన్ టాలెంట్ ను ఈసినిమాతో నిరూపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు పాటలు సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు మూడో పాటను కూడా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన వర్క్ కూడా పూర్తయిందని థమన్ తెలిపిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మాంచి మాస్ బీట్ ఉన్న థర్డ్ సింగిల్‌ను విడుదల చేయబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా చిత్ర సంగీత దర్శకుడు థమన్ తెలిపారు.

కాగా ఈసినిమాలో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మే 12న మూవీని రీలీజ్ చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.