ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు ఏ రేంజ్ లో తమ సత్తాను చాటుతున్నాయో చూస్తునే ఉన్నాం. మరీ ముఖ్యంగా సౌత్ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. గత ఏడాది వచ్చిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేసిందో చూశాం. సౌత్ ప్రేక్షకులతో పాటు నార్త్ ఆడియన్స్ కూడా పుష్ప రాజ్ కు ఫిదా ఆయిపోయారు. ఇక రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా కాబట్టి ఈసినిమాపై ఆటోమేటిక్ గానే ఈసినిమాపై భారీ అంచనాలు ఉండగా.. ఆ అంచనాలను ఆర్ఆర్ఆర్ సినిమా ఏ మాత్రం తగ్గించలేదు. అనుకున్నట్టుగా ఈసినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రీసెంట్ గా వచ్చిన కె.జి.యఫ్ 2 కూడా మరోసారి సౌత్ సినిమాల సత్తాను చూపించింది. కె.జి.యఫ్ 1 సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈసినిమా మొదటిరోజు నుండే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ కూడా షాక్ కు గురిచేస్తున్నాయి. ఈసినిమా రిలీజ్ అయిన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 134 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టింది. ఒక్క హిందీలోనే 53 కోట్లకు పైగా గ్రాస్ ను రాబట్టింది. ఇక రెండవ రోజు కూడా తన సత్తాను చాటుతుంది. రెండు రోజుల్లో ఈసినిమా దేశవ్యాప్తంగా 238 కోట్లకు పైగా గ్రాస్ ను అలానే ప్రపంచవ్యాప్తంగా 278 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ వీకెండ్ కి ఈ సినిమా 500 కోట్ల మార్కును అందుకోవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. చూద్దాం మరి ఈరెండురోజుల్లో ఈసినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో..



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























