హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీ లో హీరో యష్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.రిలీజ్ అయిన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 134 .5 కోట్లు కలెక్ట్ చేసింది. స్ట్రెయిట్ హిందీ మూవీస్ మొదటి రోజు కలెక్షన్స్ ను దాటుకుని “కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీ బాలీవుడ్ లో నెంబర్ 1 గా నిలిచి, 2 రోజులలో బాలీవుడ్ లో 100 కోట్ల క్లబ్ లో చేరింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా స్టన్నింగ్ విజువల్ ఎఫెక్ట్స్‌తో, యాక్షన్స్ సీన్స్‌తో “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రేక్షకుల , సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నారు. “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ క్లైమాక్స్ లో మేకర్స్ ఒక చిన్న హింట్ ను ఇచ్చారు. “కెజిఎఫ్ చాప్టర్ 3 “ మూవీ కూడా ఉంటుందని మేకర్స్ లీడ్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా “కె జి ఎఫ్ చాప్టర్ 3” ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభం అయ్యిందని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కార్తీక్ గౌడ అనౌన్స్ చేశారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























