“RC15 “మూవీ కి “కె జి ఎఫ్ “స్టంట్ మాస్టర్స్

KGF stunt masters for RC 15,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, KGF,KGF Movie,KGF Movie Stunt Masters,KGF Stunt Master for Ram Charan RC15 Movie,KGF Stunt Master For Ram Charan,Ram Charan RC15 Movie Updates, RC15 Movie latest Updates,RC15 Latest News,RC15 Latest news,Ramc Charan Rc15 Movie latest News,Ram Charan to work with KGF Stunt Masters

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో “#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో జయరామ్ , అంజలి, శ్రీకాంత్ , సునీల్ కీలక పాత్రలలో నటించనున్నారని సమాచారం.”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

#RC15 ” మూవీ హైదరాబాద్‌, పూణె, రాజమండ్రి షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తాజా షెడ్యూల్ ను మేకర్స్ అమృత్ సర్ లో జరుపనున్నారు. ఈ మూవీ కి ట్విన్స్ అన్బు మణి ,అరివు మణి స్టంట్ మాస్టర్స్ గా ఎంపిక అయ్యారు. స్టన్ శివ ,పీటర్ హైన్స్ , విజయం , సిల్వా , దినేష్ సుబ్బరామన్ వంటి ఫైట్ మాస్టర్స్ వద్ద అసిస్టెంట్స్ గా పనిచేసిన అన్బు మణి ,అరివు మణి పలు తమిళ ,తెలుగు , కన్నడ మలయాళ మూవీస్ కు స్టంట్ మాస్టర్స్ గా పనిచేశారు. బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ లో ఫైట్స్ అద్భుతంగా కంపోజ్ చేసి బెస్ట్ స్టంట్ మాస్టర్స్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 ” మూవీ లో ఫైట్స్ అద్భుతంగా కంపోజ్ చేసిన అన్బారివు , దర్శకుడు శంకర్ ఆలోచనలకు తగ్గట్టుగా, రామ్ చరణ్ ఎనర్జీకి తగ్గట్టుగా ఫైట్స్ కంపోజ్ చేస్తుందని సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో 50 వ చిత్రంగా భారీ చిత్ర దర్శకుడు శంకర్ ,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ”#RC15” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =