చరణ్ కు చిరు ఛాలెంజ్.. మరో పాట అప్ డేట్..!

Megastar Chiranjeevi Challenges Mega Power star Ram Charan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Megastar Chiranjeevi,Megastar Chiranjeevi Movie Updates,Megastar Chiranjeevi latest Movie News,Megastar Chiranjeevi new movie,Megastar Chiranjeevi Upcoming Movies,Megastar Chiranjeevi Give Challenges To RamCharan, Chiranjeevi Challenges Mega Powerstar Ram Charan,Mega Powerstar Ram Charan,Chiranjeevi New Challenge to Ram Charan,Ram Charan Got New Challenge From Chiranjeevi

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ఆచార్య. ఈసినిమా కోసం మెగా అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమా ఏప్రిల్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమా రిలీజ్ కు ఇంకా కొద్దిరోజులు మాత్రమే ఉండటంతో ఈసినిమా నుండి వరుసగా అప్డే ట్స్ ఇస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. రీసెంట్ గానే ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు మరో అప్ డేట్ తో ముందుకొచ్చేశారు. ఈసినిమా నుండి ఇప్పటికే పలు పాటలను రిలీజ్ చేయగా ఇప్పుడు మరో పాటను రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈనేపథ్యంలోనే ఒక చిన్న వీడియోను కూడా రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ వీడియోలో మెగాస్టార్, రామ్ చరణ్, కొరటాల శివ మాట్లాడుతూ… పాట సూపర్ గా వచ్చింది.. మీ ఇద్దరి డ్యాన్స్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అని కొరటాల అనగా.. దానికి చిరు మాట్లాడుతూ చరణ్ తో డ్యాన్స్ చేయాలంటే కాస్త టెన్షన్ గా ఉంది కానీ గట్టి పోటీ ఇస్తా అని చెప్పారు. అంతేకాదు చిరు చరణ్ ను డామినేట్ చేస్తావా అని అడుగగా లేదు అప్పా అని అంటాడు. నేను నీ బాబునిరా అని చిరు అనగా.. దానికి చరణ్ నేను కూడా ఎక్కడా తగ్గను అని అంటాడు. సరే మాటలతో ఎందుకు కెమెరా ముందు చూసుకుందాం అంటూ చిరు చరణ్ కు ఛాలెంజ్ విసురుతాడు. ఫైనల్ గా భలే భలే బంజారా అనే పాటను ఏప్రిల్ 18వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

కాాగా ఈసినిమాలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చరణ్ సరసన పూజా హెగ్డే
కనిపించనుంది. నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + twenty =