వివాహా బంధంతో ఒక్కటైన అలియా-రణ్‌బీర్‌..!

Alia Bhatt Ranbir Kapoor Gets Married,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ranbir Kapoor And Alia Bhatt,Ranbir Kapoor And Alia Bhatt Tide Knot in Family Gathering,Ranbir Kapoor And Alia Bhatt Getting Married,Ranbir Kapoor And Alia Bhatt in Family gathering, Brahmastra starring the couple Ranbir Kapoor And Alia Bhatt Tide Knot in Family Gathering,Ranbir Kapoor and Alia Bhatt tied the knot on 14th April 2022

ఒకప్పుడు ఇండస్ట్రీల్లో ప్రేమ వివాహాలు జరగడం చాలా అరుదుగా చూస్తుంటాం. సాధారణంగా సినిమా షూటింగ్ సమయాల్లో కొంతమంది హీరో హీరోయిన్లు ప్రేమలో పడినా కూడా అవి పెళ్లి వరకూ వెళతాయా అంటే గ్యారెంటీ లేదు. కానీ ఇప్పుడు అలా కాదు. హీరో హీరోయిన్లు ప్రేమలో పడటం.. పెళ్లిళ్లు చేసుకోవడం కామన్ గా చూస్తున్నాం. బాలీవుడ్ లో ఈ సంప్రదాయం మరింత ఎక్కువైపోయింది. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోహీరోయిన్స్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇటీవలే కత్రినా కైఫ్-విక్కీ కౌషల్ హడావుడి లేకుండా పెళ్లి చేసుకున్నారు. తాజాగా మరో ప్రేమ జంట కూడా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ర‌ణ్‌బీర్ క‌పూర్, అలియా భట్ ఎప్పటినుండో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే కదా. అయితే బహిరంగంగా మాత్రం వారిద్దరూ ఎప్పుడూ బయటకు చెప్పింది లేదు. ఇక ఫైనల్ గా ఈ లవ్ బర్డ్స్ మూడు ముళ్ల‌తో ఒక్క‌టైయ్యారు. వీరిద్దరి వివాహం పంజాబ్ సంప్ర‌దాయ ప‌ద్దతిలో ఘ‌నంగా నిర్వ‌హించారు. బాంద్రాలోని వాస్తు అపార్ట్ మెంట్ లో వీరి వివాహం జ‌రిగింది. అతి కొద్ది మంది అతిథిల మ‌ధ్య ర‌ణ్ బీర్ క‌పూర్ అలియా భ‌ట్ వివాహా బంధంలోకి అడుగు పెట్టారు.

కాగా సినిమాల వియానికొస్తే అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్‌కపూర్‌, అలియా భట్ లు హీరో హీరోయిన్స్ గా వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఈమధ్యనే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌ తో పాటు టాలీవుడ్ అగ్రహీరో నాగార్దున కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ల‌పై క‌ర‌ణ్ జోహార్‌, ర‌ణ్ బీర్ క‌పూర్‌, అయాన్ ముఖ‌ర్జీ, అపూర్వ మెహ‌తా, న‌మిత్ మ‌ల్హోత్రా బ్ర‌హ్మాస్త్ర చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు. ఈసినిమా ఫస్ట్ పార్ట్ ను సెప్టెంబర్ 9 న రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + twelve =