ఎన్టీఆర్ పై రాజమౌళి ప్రశంసలు

Rajamouli superb words about young Tiger Jr NTR,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, SS Rajamouli,Ace Director SS Rajamouli,Rajamouli RRR Movie,Rajamouli About Jr NTR,Rajamouli Superb Words about Jr NTR,Rajamouli,Jr NTR RRR Movie,RRR Blockbuster Movie, Rajamouli Comment on Young Tiger Jr NTR,Jr NTR Acting in RRR Movie,Jr NTR Career Best Performance in RRR Movie,Jr NTR Performance in RRR Movie

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ విశేష ప్రేక్షకాదరణతో ప్రపంచవ్యాప్తంగా 17 రోజులకు 1029 కోట్ల గ్రాస్‌ , 564.22 కోట్ల షేర్‌ తో దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఆర్ ఆర్ ఆర్ “మూవీ లో పవర్ ఫుల్ ఇంట్రడక్షన్ సీన్స్ తో ఇద్దరు హీరోలను దర్శకుడు రాజమౌళి అద్భుతంగా ప్రెజెంట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో దర్శకుడు రాజమౌళి ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించారు. కొమురం భీముడో సాంగ్ లో ఎన్టీఆర్ పలికించిన హవభావాలు ఇండియా వైడ్ గా వున్న ఏ స్టార్ నటుడు పలికించలేడనీ , ఎమోషన్, పెయిన్ ని అన్నింటినీ ఒకే షాట్ లో ప్రదర్శించి నటుడిగా తానేంటో మరో సారి నిరూపించాడనీ , ఇది ఎన్టీఆర్ నటనకు ప్రతి రూపం అంటూ ఎన్టీఆర్ ను రాజమౌళి ప్రశంసించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.