సూపర్ రెస్పాన్స్ తో ఆకట్టుకుంటున్న ‘ఆచార్య’ ట్రైలర్

Acharya Trailer Gets Superb Response,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Acharya,Acharya Telugu Movie,Acharya Movie Latest updates,Acharya Movie updates,Acharya Movie Trailer Superb Response,Acharya Telugu Movie Trailer Response,Chiranjeevi Acharya Movie Trailer Response, Acharya Movie Trailer Response,Chiranjeevi and Ram Charan Movie Acharya Trailer Released,Mega Star Chiranjeevi and Ram charan movie Acharya Trailer Response

మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆచార్య. ఈసినిమాలో మెగాస్టార్ చిరంజీవి అలానే తనయుడు రామ్ చరణ్ ఇద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుండటం.. మరోవైపు చిరు సైరా నరసింహా రెడ్డి తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా కరోనా వల్ల లేట్ అయింది. ఇక మరికొద్దిరోజుల్లో అయితే ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈసినిమానుండి ఎన్నో పోస్టర్లు, పాటలు, టీజర్ రిలీజ్ చేసేశారు. అన్ని సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ఎప్పటినుండో ప్రేక్షకులు ట్రైలర్ కోసం ఎదురుచూస్తుండగా ఈసినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ట్రైలర్ విషయానికొస్తే రామ్‌ చరణ్ వాయిస్‌ ఓవర్‌తో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. యాక్షన్, ఎమోషన్ రెండూ ఈట్రైలర్ లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఉన్న సన్నివేశాలు ఆకర్షణగా ఉన్నాయి. ధర్మస్థలి.. అపధర్మస్థలి ఎలా అవుతది ?, పాదఘట్టం వాళ్ల గుండెలపై కాలు వేస్తే.. ఆ కాలు తీసేయాలట.. వంటి డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. ఇప్పటికే 13 మిలియన్ కి పైగా వ్యూస్ సొంతం చేసుకోగా.. 7 లక్షలకి పైగా లైక్స్ తో సాలిడ్ రెస్పాన్స్ ని అందుకుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ ట్రైలర్ యూట్యూబ్ లో నెంబర్ 1 ట్రెండింగ్ లోకి కూడా వచ్చేసింది. మొత్తానికి ట్రైలర్‌ చూస్తుంటే ఇప్పటివరకు సినిమాపై ఉన్న అంచనాలు ఇంకాస్తా పెరిగేలా ఉ‍న్నాయి.

కాాగా ఈసినిమాలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చరణ్ సరసన పూజా హెగ్డే
కనిపించనుంది. నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 5 =