మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ జూన్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయిక . హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు , తమిళ , మలయాళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో కథానాయికగా ప్రేక్షకులను అలరించిన నదియా సక్సె ఫుల్ “మిర్చి” మూవీ తో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారారు. “అత్తారింటికి దారేది “, “అఆ”, “దృశ్యం”, దృశ్యం 2 ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన నదియా ఇప్పటి వరకు తెలుగు లో తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకోలేదు. నాని హీరోగా నటించిన “అంటే సుందరానికీ ” సినిమాలో హీరోయిన్ నజ్రియా నజీమ్‌కు తల్లిగా నటించిన నదియా ఫస్ట్ టైమ్ తన పాత్రకు స్వయంగా వాయిస్ ఇచ్చారు.తెలుగులో తొలిసారి డబ్బింగ్ చెప్పాననీ , చాలా ఎగ్జైటింగ్‌గా ఉందనీ , తనపై నమ్మకం ఉంచిన దర్శకుడు వివేక్ ఆత్రేయకు థాంక్స్ అంటూ తన డబ్బింగ్ వీడియో ను నదియా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: