యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘రావణాసుర’

Ravanasura Latest Schedule Wrapped Up,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ravanasura,Ravanasura Movie,Ravanasura Telugu Movie,Ravanasura movie Updates,Ravanasura latest Updates,Ravanasura latest Shooting Updates,Ravanasura Shoot Updates,Ravi Teja Ravanasura Shooting Updates, Ravi Teja Ravanasura Action Packed Shoot Wrappedup,Ravanasura Action Packed Schedule Wrapped in Hyderabad,Ravi Teja Upcoming Movie,Ravi Teja latest Movie Updates,Ravi Teja Shoot Updates,Ravanasura Movie

మాస్ మహారాజా రవితేజ మాత్రం చక చకా ఒక సినిమా తర్వాత మరొక సినిమాను పూర్తి చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం రవితేజ లిస్ట్ లో చాలా సినిమాలు ఉన్నాయి. వాటిలో అన్నీ సినిమాలు దాదాపు సెట్స్ పైన ఉన్నాయి. ఒక సినిమా చేస్తూనే మరోపక్క పార్లల్ గా వేరే సినిమాలు కూడా పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే రామారావు ఆన్ డ్యూటీ సినిమా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈసినిమాతో పాటు క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ తో రావణాసుర సినిమాను చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈసినిమా షూటింగ్ ను ఇటీవలే మొదలుపెట్టగా ప్రస్తుతం రెండో షెడ్యూల్‌ ను జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకుంది. ఇక విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తమ ట్విట్టర్ వేదికగా తెలియచేశారు. ఈ షెడ్యూల్లో కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు.. యాక్షన్ సీక్వెన్స్ ను కూడా పూర్తి చేసినట్టుగా పోస్ట్ లో పేర్కొన్నారు.

కాగా ఈసినిమాలో సుశాంత్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. రవితేజ లాయర్‌గా నటిస్తుండగా, సుశాంత్ కీలక పాత్రలో రామ్‌గా కనిపించనున్నాడు. సుధీర్ వర్మ ఈ సినిమాలో రవితేజను మునుపెన్నడూ చూడని పాత్రలో చూపించ‌బోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు మొత్తం ఐదుగురు హీరోయిన్లు అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షనాగార్కర్, పూజిత పొన్నాడ నటించనున్నారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్‌వర్క్స్‌ బ్యానర్ పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − thirteen =