‘సర్కారు వారి పాట’.. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తి..!

Sarkaru VaaaSarkaru Vaari Paata Shooting Wrapped Up Except for one song,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Telugu movie,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Movie Updates,Sarkaru Vaari Paata Latest Movie updates, Sarkaru Vaari Paata Shooting,Sarkaru Vaari Paata Shooting Updates,Sarkaru Vaari Paata Shooting Wrapped Up,Sarkaru Vaari Paata Shooting Left with one song,Sarkaru Vaari Paata Shooting Latest Updates, Mahesh Babu Sarkaru Vaari Paata Shooting Updatesri Paata Shooting Wrapped Up Except for one song

సూపర్ స్టార్ మహేష్ అభిమానులు తమ అభిమాన సినిమాకోసం ఎంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ నుండి సినిమా వచ్చి చాలా రోజులే అయిపోయింది. దీంతో మహేష్ ను ఎప్పుడెప్పుడు స్క్రీన్ పై చూద్దామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కరోనా కనుక రాకపోయి ఉంటే సర్కారు వారిపాట గత ఏడాదే రిలీజ్ అయి ఉండేది కానీ కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడటం.. ఆతర్వాత పలు కారణాల వల్ల ఈసినిమా వాయిదా పడింది. ఫైనల్ గా మే 12న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇన్నీ రోజులు ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉంది. ఇక తాజాగా ఈసినిమా టాకీ పార్ట్ ను మొత్తం పూర్తి చేసుకుంది. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలిపింది. ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయిందని తెలిపారు. త్వరలోనే బ్యాలన్స్ ఉన్న ఆ పాటను కూడా పూర్తిచేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా పరశురామ్‌ దర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఇక ఈసినిమా విడుద‌లకు ఇంకో నెల రోజులు స‌మ‌యమే ఉండటంతో. ఈ నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్టేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి రెండు పాట‌లు విడుద‌లై మంచి రెస్పాన్స్ ను సొంతంచేసుకున్నాయి. త్వరలో మూడో పాట‌ను కూడా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఈసినిమాలో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 17 =