మేఘా ఆకాష్-రాహుల్ విజయ్ సినిమా.. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్..!

Megha Akash Rahul Vijay Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Megha Akash Rahul Vijay Movie,Megha Akash Rahul Vijay Movie Updates,Megha Akash Rahul Vijay Telugu Movie,Megha Akash Rahul Vijay latest Updates,Megha Akash Rahul Vijay New Movie, Megha Akash Rahul Vijay Shooting Updates,Megha Akash Rahul Vijay Shoot Updates,Megha Akash Rahul Vijay Completes First Schedule,Megha Akash Rahul Vijay Movie Updates,

మేఘా ఆకాష్ కూడా టాలీవుడ్ లోకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చినా కూడా ఇప్పటివరకూ సాలిడ్ హిట్ కొట్టింది లేదు. కేవలం తెలుగులో మాత్రమే కాదు తమిళ్ లో కూడా మేఘా చాలా అవకాశాలను అందిపుచ్చుకుంది. అయితే వరుసగా సినిమాలు చేస్తుంది కానీ మేఘాకు మాత్రం సరైన సక్సెస్ రావడంలేదు. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాతో వచ్చేస్తుంది. రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ జంటగా ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే ఈసినిమాను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించి షూటింగ్ ను కూడా స్టార్ట్ చేశారు. అభిమన్యు బద్ది దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ మరీ తెలిపింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాను మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పిస్తుండగా.. కోట ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఎ సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు.ఇంకా ఈసినిమాలో రాజేంద్రప్రసాద్, ‘వెన్నెల’ కిషోర్ మరో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. సుశాంత్ రెడ్డి కథను అందిస్తుండగా హరి గౌర సంగీతం అందిస్తున్నారు. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తుండగా ప్రవీణ్ ఎడిటర్ గా చేస్తున్నారు. మరి ఈసినిమాతో అయిన మేఘాకు మంచి విజయం అందుతుందేమో చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − eleven =