అందుకే మీడియాకు నేను దూరం..!

Vijay reveals why he is away from media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Thalapathy Vijay,Thalapathy Vijay Beast Movie,Thalapathy Vijay Reveals The Reason For Nit Giving an Interview,Thalapathy Vijay Not Giving Interview From 11 Years, Thalapathy Vijay About The Reason behaind Not Giving Interviews,Thalapathy Vijay About Not Giving Interview,Thalapathy Vijay Beast Movie Upddates,Thalapathy Vijay Upcoming Movie Beast on April 14th, Thalapathy Vijay Beast Movie Releasing on 14th April,Thalapathy Vijay Interview,Thalapathy Vijay Press Meet

ఒక్కోసారి సినీ సెలబ్రిటీలకు ప్రెస్ మీట్లలో విచిత్రమైన ప్రశ్నలు ఎదురవుతుంటాయి. ఒక్కోసారి అవి ఇబ్బందిగా అనిపించినా కూడా చాలా ఓపికగా సమాధానాలు చెబుతుంటారు వాళ్లు. అంతేకాదు ఒక్కోసారి తమ సమాధానాలను వక్రీకరించి రాస్తారు కూడా.. దానివల్ల అప్పుడప్పుడు కొంతమంది సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు కూడా. ఇక ఇప్పుడు ఒక స్టార్ హీరో కూడా తను మీడియాకు దూరంగా ఉండటానికి కారణం ఏంటో చెబుతున్నాడు. ఈ హీరో ఎవరో కాదు తమిళ స్టార్ హీరో విజయ్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా వస్తున్న సినిమా బీస్ట్. ఇక ఈసినిమా రిలీజ్ ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. ఈనేపథ్యంలో విజయ్ పలు ఇంటర్వ్యూల్లో వరుసగా పాల్గొంటున్నారు. ఈ ఇంటర్వ్యూలో తాను మీడియాకు ఎందుకు దూరంగా ఉన్నాడో క్లారిటీ ఇచ్చాడు. నేను ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడానికి కారణం నేను బిజీగా ఉన్నందు వల్ల కాదు.. ఇంటర్వ్యూలకు దూరంగా ఉన్నాను అంటే.. సుమారు 10, 11 సంవత్సరాల క్రితం ఒక ఘటన జరిగింది. అప్పట్లో నేను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాను. కానీ నేను చెప్పింది కాకుండా మరోలా రాశారు. అది అప్పట్లో వివాదాస్పదం అయ్యింది. అందుకే నేను మీడియాకు దూరంగా ఉండాలని అనుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా యాక్ష‌న్ కామెడీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈసినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. కాాగా ఈసినిమాలో సెల్వ రాఘవన్ నెగెటివ్ రోల్ లో నటించనుండగా.. యోగిబాబు మరో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ మూవీని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ వారు నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.