మాస్ మహారాజా రవితేజ మాత్రం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది ఖిలాడి సినిమాతో ప్రారంభించగా ఏడాది చివరిలోగా కనీసం రెండు సినిమాలైనా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అందులో ముందుగా రామారావు ఆన్ డ్యూటీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శరత్ మండవ దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అంశాలతో ఈసినిమా తెరకెక్కుతుది. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా జరుపుకుంటుంది. రీసెంట్ గానే రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు మేకర్స్. జూన్ 17వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. దీంతో ఇప్పటినుండే చిత్రయూనిట్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిలో భాగంగానే ఫస్ట్ సింగిల్ అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ‘బుల్ బుల్ తారంగ్’ అంటూ వచ్చే ఈ మొదటి పాటను ఈ నెల 10వ తేదీన విడుదల చేయనున్నట్టు అధికారిక పోస్టర్ ను వదిలారు. ఇక ఈపాటకు రాకేందుమౌళి సాహిత్యాన్ని అందించగా.. ఈ పాటని సిద్ శ్రీరామ్ ఆలపించారు.
Ramarao prema 👩❤️👨❤️#RamaRaoOnDuty First single 🎵 #BulBulTarang on 10th April 😊#RamaRaoOnDutyOnJune17 pic.twitter.com/8oBZpumVBt
— Ravi Teja (@RaviTeja_offl) April 7, 2022
ఈ సినిమాలో దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తుండగా వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్, ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈసినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: