హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూ పొందిన యాక్షన్ కామెడీ “గబ్బర్ సింగ్ “మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హీరో పవన్ కళ్యాణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని , బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలా “గబ్బర్ సింగ్ ” మూవీ ని దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించారు. మరో సారి వీరిద్దరి కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “హరి హర వీరమల్లు “మూవీ తాజా షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్స్ సీక్వెన్స్‌తో పాటు టాకీ పార్ట్ కూడా పూర్తి చేయనున్నారని సమాచారం.మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,పూజాహెగ్డే జంటగా“భవదీయుడు భగత్ సింగ్ “మూవీ తెరకెక్కనుంది.తాజాగా మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు. హీరో పవన్ కళ్యాణ్‌తో నిర్మాతలు, దర్శకుడు కలిసి ఉన్న లేటెస్ట్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి “భవదీయుడు భగత్ సింగ్” మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్టు వెల్లడించారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: