మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన “గని “మూవీ ఏప్రిల్ 8 వ తేదీ రిలీజ్ కానుంది. బాక్సర్ గా నటించిన హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ పొందారు. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ కథానాయిక. స్టార్ హీరోయిన్ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.“గని” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై హైప్ ను క్రియేట్ చేశాయి.
“గని”మూవీ రిలీజ్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి “గని” చిత్ర యూనిట్ కు సోషల్ మీడియా ద్వారాఆల్‌దిబెస్ట్ తెలిపారు.“గని”మూవీ లో వరుణ్‌ని చూసి థ్రిల్ అయ్యాననీ , తనను తాను మార్చుకోవడానికి వరుణ్ నిరంతరం ప్రయత్నిస్తాడనీ , గొప్ప కళాకారుడికి ఇది ఒక గుర్తు అనీ , నిన్ను నువ్వు కొత్తగా ఆవిష్కరించుకోవాలనే కోరికే నీ అతిపెద్ద బలం వరుణ్ , “గని” కోసం ఎదురుచూస్తున్నాఅంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
So thrilled to see how @IAmVarunTej constantly strives to transform himself! Mark of a great artist! Proud he is family.
This urge to reinvent yourself is your biggest strength Varun! Looking forward to #Ghani tomorrow & Wishing the entire Team, All the Very Best! pic.twitter.com/lXpZIJdcZF
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 7, 2022
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: