దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించగా.. ఎన్టీఆర్.. గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ఈసినిమా గత నెల మార్చి 25న రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.ఇక తాజాగా ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్లు కలెక్షన్స్ సాధించింది మరో రికార్డ్ క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఇక్కడ సక్సెస్ పార్టీ జరుపుకున్న చిత్రయూనిట్ ముంబై లో కూడా సక్సెస్ మీటింగ్ ను ఏర్పాటు చేసింది. ఇక ఈకార్యక్రమాని బాలీవుడ్ పెద్దలు ఆమిర్ ఖాన్, కరణ్ జోహార్ తదితరులు పాల్గొనన్నారు. ఈసందర్భంగా ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ.. సినిమాపై అలానే రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ ప్రశంసలు కురిపించారు. సినిమా విడుదలకు ముందు ఎంత ఒత్తిడి ఉంటుందో నాకు తెలుసు. ఆర్ఆర్ఆర్ విడుదలై ఇంతటి ఘన విజయం సాధించిన తర్వాత రాజమౌళి గారు.. ఆయన టీమ్ మొత్తం చాలా సంతోషంగా ఉంది. ఇలాగే అద్భుతమైన విజయాలు అందుకోవాలని.. మంచి సినిమాలతో మమ్మల్ని ఎప్పుడూ ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నా అని ఆమిర్ ఖాన్ తెలిపారు.
ఆ తర్వాత రాజమౌళి మాట్లాడుతూ.. ఆమిర్ ఖాన్ , నాకు మధ్య ఒక ఒప్పందం ఉంది. మేమిద్దరం కేవలం పేర్లు పెట్టే పిలుచుకోవాలని.. సర్, గారు అనే పదాలు ఉపయోగించుకోకూడదని ఇటీవలే ఒప్పందం చేసుకున్నాం. ముందు ఆమిర్ ను ఏకే అని పిలవడానికి చాలా ఇబ్బంది పడ్డాను కానీ ఆయనే నన్ను ఏకే అని పిలిచేలా చేశారు.. ఇప్పుడు ఆయన ఆ అగ్రిమెంట్ ను బ్రేక్ చేశారు నన్ను రాజాజీ అని పిలుస్తున్నారు అంటూ కామెడీ చేశారు.
ఈసినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటించింది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి, రాహుల్ రామకృష్ణ నటించారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మించగా. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: