ప్రశాంత్ నీల్ కు ‘అధీరా’ టాప్ రేటింగ్..!

Sanjay Dutt aka Adheer is all praises for Prashanth Neel,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,, Sanjay Dutt,Sanjay Dutt Movies,Sanjay Dutt upcoming Movies,Sanjay Dutt latest Movie updates,Sanjay Dutt upcoming Film KGF Chpater 2,Sanjay Dutt KGF2 Movie Updates, Sanjay Dutt About Prashanth Neel,Director Prashanth Neel,Sanjay Dutt As Aka Adheer in KGF Chpater 2,Sanjay Dutt Praises Prashanth Neel,Sanjay Dutt Aka Adheer Praises Prashanth Neel, Sanjay Dutt Praises KGF Chapter 2 Directcor,Sanjay Dutt Praises KGF Chapter 2 Directcor Prashanth Neel

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమా కె.జి.యఫ్ 2 సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్ హీరోగా వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచింది. ఈనేపథ్యంలో వరుసగా ఈవెంట్స్ ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు మరో ఈవెంట్ ను నిర్వహించారు చిత్రయూనిట్. ఇక ఈసందర్భంగా సంజయ్ దత్ ప్రశాంత్ నీల్ పై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు తనకు టాప్ రేటింగ్ కూడా ఇచ్చారు. ప్రశాంత్‌ నీల్ కు ఎంత రేటింగ్ ఇస్తారు అని అడిగినప్పుడు సంజయ్ దత్ అసలు ఏమాత్రం ఆలోచించకుండా.. తన కెరీర్‌లో ఇప్పటివరకూ పనిచేసిన టాప్ ఐదుగురు దర్శకులలో ఒక్కరు అని చెప్పారు. మరి సంజయ్ త్ తన కెరీర్ లో ఎన్నో సినిమాలు చేసి ఉంటారు. ఎంతో మంది లెజెండరీ డైరెక్టర్స్ తో చేసి ఉంటారు. అలాంటి సంజయ్ దత్ లాంటి హీరో నుండి ప్రశాంత్ నీల్ కు ఇలాంటి కాంప్లిమెంట్ రావడం విశేషమనే చెప్పొచ్చు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ కానుంది. కె.జి.యఫ్ ఫస్ట్ పార్ట్ సక్సెస్ కారణంగా ఇప్పుడు కె.జి.యఫ్2 సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మరి ఈసినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇంకా ప్ర‌కాష్ రాజ్‌, ఇంకా రావు రమేష్ తో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మరి సినిమా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.