బాలీవుడ్ లో “ఆర్ ఆర్ ఆర్”సక్సెస్ సెలబ్రేషన్స్

RRR Movie Team Success Celebration Party In Mumbai,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, RRR Movie,RRR Movie Celebrations,RRR Movie Team Success Celebration Party,RRR Movie party in Mumbai,RRR Movie Celebrations Party In Mumbai,RRR Success party, RRR Movie Team Success Celebration In Mumbai,RRR Movie Team at Mumbai,RRR Movie Success

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని, భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే 200కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.ప్రపంచవ్యాప్తంగా “ఆర్ ఆర్ ఆర్” మూవీ 950 కోట్లకు పైగా కలెక్ట్ చేసి 1000 కోట్ల దిశగా దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు రాజమౌళి విజువల్ వండర్ గా తెరకెక్కించిన “ఆర్ ఆర్ ఆర్” మూవీ అన్ని భాషల లోనూ భారీ కలెక్షన్స్ రాబడుతూ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. బాలీవుడ్ లో 200 కోట్ల కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. హిందీలో ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ సంస్థ అధినేత జయంతి లాల్ రిలీజ్ చేశారు. “ఆర్ఆర్ఆర్” ఊహించిన విధంగా సక్సెస్ కావడంతో జయంతిలాల్ సక్సెస్ పార్టీ ఇచ్చారు.
ఈ పార్టీకి రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, దానయ్య ఇతర ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ హాజరయ్యారు. బాలీవుడ్ సెలెబ్రిటీలుకరణ్ జోహార్, జావేద్ అక్తర్, అమీర్ ఖాన్ “ఆర్ఆర్ఆర్” సక్సెస్ సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు. బాలీవుడ్ నటి రాఖీ సావంత్, టివి నటి శ్వేతా తివారి కుమార్తె పాలక్ తివారి” ఆర్ఆర్ఆర్” సక్సెస్ పార్టీలో మెరిశారు.బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా క్యురేషి “ఆర్ఆర్ఆర్” సక్సెస్ సెలెబ్రేషన్స్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.