వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా అంటే సుందరానికి.
రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది ఈసినిమా. మరోపక్క చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. ఇక ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకొంటుంది. ఇక ఇప్పుడు ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు మేకర్స్. దీనిలో భాగంగానే పంచెకట్టు అనే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈపాట సంగీత ప్రియులని అలరిస్తోంది. ట్రెండీ ట్యూన్ తో సరికొత్తగా, సరదాగా సాగిపోయే సాహిత్యంతో స్వరపరిచిన ఈ పాట మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. పద్మశ్రీ అవార్డు గ్రహీత, లెజెండరీ క్లాసికల్ సింగర్ అరుణా సాయిరామ్ ఈ పాటను అద్భుతంగా పాడగా, హసిత్ గోలీ సాహిత్యం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ‘పంచెకట్టు’పాట సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుకుంటుంది చిత్ర యూనిట్. ఈ వేడుకని కూడా పంచెకట్టు థీమ్ లో డిజైన్ చేశారు. ఈ పార్టీకి చిత్ర యూనిట్ అంతా పంచకట్టులో హాజరయ్యారు. సినిమా కోసం టీమ్ చేస్తున్న వినూత్న ప్రచారం అందరిలోనూ ఆసక్తిని పెంచుతుంది.
Rangamlo dunkaaru… Andamgaa Mastaaruu ❤️
Pics from #ThePanchakattuParty 😎🔥
▶️ https://t.co/otK4SwqbTr#AnteSundaraniki#ThePanchaKattuSong@NameisNani #NazriyaFahadh #VivekAthreya @oddphysce @arunasays @hasithgoli @saregamasouth pic.twitter.com/lKSf0eAzNu
— Mythri Movie Makers (@MythriOfficial) April 6, 2022
కాగా నజ్రియా హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈసినిమాలో నదియ,హర్ష వర్ధన్,రాహుల్ రామకృష్ణ,సుహాస్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్. జూన్ 10వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: