సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. పరుశురాం దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు. ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేయడమే కాకుండా వరుసగా పాటలు కూడా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేయగా.. మూడో పాట కూడా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్,14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా తరువాత మహేష్ త్రివిక్రమ్ అలానే రాజమౌళితో సినిమాలు చేయనున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా గత కొద్దిరోజులుగా మహేష్ బాబు ఓ హాలీవుడ్ మూవీకి ఓకే చెప్పినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై క్లారిటీ ఇచ్చాడు మహేష్. తాజాగా హైదరాబాద్ లో ఓ ఈవెంట్ కు మహేష్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. ఈ సందర్భంగా తన హలీవుడ్ ప్రాజెక్ట్ గురించి కూడా అడుగగా.. నాకు ఏ హాలీవుడ్ ప్రాజెక్ట్ గురించి తెలియదు అంటూ సింపుల్ అండ్ షార్ట్ ఆన్సర్ తో క్లారిటీ ఇచ్చారు. ఇక రాజమౌళి సినిమా గురించి మాత్రం మహేష్ ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. మరి దీంతో ఇప్పటికైనా ఈ రూమర్స్ కు బ్రేక్ పడుతుందేమో చూద్దాం..




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























