టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ మాత్రం అస్సలు తగ్గేదేలే అంటున్నాడు. సాయికుమార్ తనయుడిగా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆది సాయికుమార్.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోని వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గ్యాప్ లేకుండా ఒక సినిమా తర్వాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఆది సాయికుమార్ నుండి కొత్త సినిమా వచ్చి చాలా రోజులైపోయింది. ప్రస్తుతం ఆది లిస్ట్ లో ఒకటి కాదు రెండు కాదు చాలా సినిమాలే ఉన్నాయి. తీస్ మార్ ఖాన్, అతిథి దేవోభవ, కిరాతక, బ్లాక్, జంగిల్, అమరన్ ఇంకా పలు సినిమాలు ఉన్నాయి. వీటిలో కొన్ని సినిమాలు రిలీజ్ అవుతుండగా కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఆ సినిమాలతో బిజీగా ఉండగానే మరో సినిమాను ప్రారంభించేశాడు ఆది సాయికుమార్. ఆది హీరోగా శశికాంత్ దర్శకత్వంలో మరో కొత్త సినిమా రానుంది. ఈసినిమాను నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు చిత్రయూనిట్. ఈసినిమా షూటింగ్ ను త్వరలోనే స్టార్ట్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#Aadisaikumar‘s next flick under #DhanaLakshmiProductions Starts with a formal Pooja ceremony
🌟ing:#AadiSaiKumar @actorbrahmaji #SatyamRajesh
🎬:#Shashikanth
💰:#SridharReddyKV @adityamovies Presents
Ex-Producer:#GiridharMamdipally
🎥 : #SaiSreeram
✂️ : #PraveenPudi pic.twitter.com/GrhlqyUpek— AadiSaikumar (@AadiSaikumar) April 7, 2022
ఇంకా ఈసినిమాలో బ్రహ్మాజీ, సత్యం రాజేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆదిత్య మూవీస్ సమర్పణలో ధనలక్ష్మీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీధర్ రెడ్డి ఈసినిమాను నిర్మిస్తుండగా.. గిరిధర్ మామిడిపల్లి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటో గ్రాఫర్ గా పనిచేస్తుంది.. ప్రవీణ్ ఎడిటర్ గా పనిచేయనున్నారు. ఈసినిమాలో నటించే హీరోయిన్ మిగిలిన నటీనటుల వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.