డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10, 000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. భారీ అంచనాల మధ్య నాలుగు సంవత్సరాల తరువాత రిలీజ్ అయిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” ప్రపంచవ్యాప్తంగా అద్భుత రెస్పాన్స్ అందుకుని ప్రాంతీయ చిత్రం అనే హద్దులు చెరిపేసి ఇండియన్ మూవీ గా అవతరించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Thank You, each and every one, for your unwavering love.
Your love, admiration and support is what keeps me going…
Enjoy the visual spectacle that is #RRRMovie.
— Jr NTR (@tarak9999) March 25, 2022
“ఆర్ఆర్ఆర్” సినిమాని సక్సెస్ చేసినందుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ”ఆర్ఆర్ఆర్” విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలనీ , ప్రేక్షకుల ప్రేమ, అభిమానం, మద్దతు తనను ముందుకు నడిపిస్తున్నాయనీ, ప్రేక్షక, అభిమానుల అమితమైన ప్రేమకు ధన్యవాదాలనీ , విజువల్ వండర్ ” ఆర్ఆర్ఆర్” మూవీ ను ఆస్వాదించండి అంటూఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: