రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాహుబలి సిరీస్ తరువాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా కావడంతో ఈసినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. అంతేకాదు బాహుబలి రికార్డులను ఈసినిమా బద్దలు కొడుతుందన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాను చూసిన ప్రతి ఒక్కరూ రాజమౌళిపై ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోతున్నారు. ఇప్పటికే సినీ సెలబ్రిటీలు చాలా మంది ఈసినిమాను చూసి సోషల్ మీడియా ద్వారా స్పందించి ప్రశంసిస్తున్నారు. ఇక తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా ఈసినిమాను తన ఇన్ట్సా ద్వారా స్పందించారు. ‘మీరు పక్కనే వున్నా మిమ్మల్ని అందుకోవాలంటే పరిగెత్తాలి.. మేం ఆకాశంలో వున్నా మిమ్మల్ని చూడాలంటే తలెత్తాలి.. రాజమౌళి సార్.. మీకూ మాకూ ఒకటే తేడా.. ఇలాంటి సినిమా మీరు తీయగలరు మేం చూడగలం అంతే..’’ అంటూ సుకుమార్ రాజమౌళిని పొగడ్తలు కురిపించారు.
View this post on Instagram
ఇక సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఇటీవల పుష్ప.. ది రైజింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు పుష్ప పార్ట్ 2 తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. పార్ట్ 1 హిట్ అవ్వడంతో సెకండ్ పార్ట్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరి చూద్దాం పార్ట్ 2 తో సుకుమార్ మరో సాలిడ్ హిట్ కొడతాడేమో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: