కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో సూపర్ హిట్ “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ “గాడ్ ఫాదర్ ” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో, సత్యదేవ్, అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“గాడ్ ఫాదర్ “మూవీ షూటింగ్ ముంబై లో జరుగుతుంది. సల్మాన్, చిరంజీవిలపై కీలకమైన సన్నివేశాలు దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ సమయంలో నిర్మాతలు ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్‌లు కూడా సెట్ కి వచ్చారు. దీంతో అందరు కలిసి సెట్లో ఫోటో దిగారు. దర్శకుడు మోహన్రాజుతోపాటు సల్మాన్, చిరు, ఆర్బీ చౌదరీ, ఎన్వీప్రసాద్ కలిసి దిగిన ఫోటోని అభిమానులతో పంచుకోగా, ప్రస్తుతం అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ ఫోటోని చూసిన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: