ప్రభాస్ నెక్ట్స్ సినిమాల్లో ఏసినిమా కోసం ఎదురుచూస్తున్నారు..?

For Which Prabhas Next Film You Aare More Excited,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Prabhas,Rebel Star Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Upcoming Movies,Prabhas latet Movies,Prabhas Radhe Shyam Movie,Prabhas New Projects,Prabhas Next Projects Director Om Raut Prabhas Movie Adipurush,Prabhas Salaar Movie,Prabhas Project K Movie Updates,Spirit Prabhas Movies,Sandeep Reddy Vanga Movie Project K,Maruthi new movie with Prabhas,

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే తను నటించిన రాధేశ్యామ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయింది. దాదాపు మూడేళ్ల పాటు ఈసినిమా కోసం ఎదురుచూసిన ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులందరికీ ఈసినిమా నచ్చేసింది. ఇక ఇప్పుడు ప్రస్తుతం తన ఫోకస్ ను తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై పెట్టాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆది పురుష్ సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. నిజానికి ఈసినిమా కూడా ఇదే ఏడాది రిలీజ్ అవ్వాలి కానీ గ్రాఫిక్స్ కు ఎక్కువ టైమ్ పడుతుండటంతో పోస్ట్ పోన్ అయింది.

ప్రస్తుతం అయితే సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అందులో కూడా సలార్ సినిమా ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతుండటంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ప్రాజెక్ట్ కే సినిమాను అయితే పాన్ వరల్డ్ రేంజ్ లో చిత్రీకరిస్తున్నట్టు సినిమాను ప్రకటించినప్పుడే చెప్పారు. ఇంకా ఈసినిమా కాస్టింగ్ కూడా భారీగానే ఉంది. నాగ్ అశ్విన్ కూడా ఈసినిమా కోసం కొత్త ప్రపంచాన్నే సృష్టిస్తున్నట్టు అర్థమవుతుంది.

ఇక ఇంకా సెట్స్ పైకి రాని సినిమా స్పిరిట్. సందీప్ వంగా దర్శకత్వంలో ఈ సినిమా తెరెకక్కుతుంది. మరోవైపు మారుతితో కూడా సినిమా రానున్నట్టు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది అందరికీ. అధికారికంగా ఇంకా ప్రకటించకపోయినా ప్రభాస్-మారుతి కాంబినేషన్ లో సినిమా రావడం మాత్రం పక్కా అని తెలిసిపోయింది. మారుతి కూడా ప్రభాస్ కోసం ఒక సాలిడ్ కథను సిద్దం చేస్తున్నట్టు తెలుస్తుంది.

మరి ఈ సినిమాల్లో మీరు ఏ సినిమా కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారో మీ ఓటు ద్వారా తెలియచేయండి.

ప్రభాస్ నెక్ట్స్ సినిమాల్లో ఏసినిమా కోసం ఎదురుచూస్తున్నారు..?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − four =