టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లిస్ట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన ల పేర్లు కూడా ఉంటాయి. ఇక రామ్ చరణ్ తన సినిమాలతో బిజీగా ఉన్నా.. మరో పక్క ఉపాసన తన బిజినెస్ లతో బిజీగా ఉన్నా టైమ్ ఉన్నప్పుడల్లా ట్రిప్ లకు వెళుతుంటారు. ఇక రీసెంట్ గా కూడా వీరిద్దరూ వెకేషన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే కదా. ఫిన్ లాండ్ ట్రిప్ వెళ్లి అక్కడ మంచు పర్వతాల్లో సరదాగా గడిపి వచ్చారు ఈ జంట. ఇక అక్కడ సరదాగా గడిపిన క్షణాలను కూడా సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉన్నారు. ఎయిర్ పోర్టులో రామ్ చరణ్ ను ఉపాసన ట్రాలీపై కూర్చొపెట్టి అటు ఇటూ తిప్పడం, అలాగే ఉపాసనను రామ్ చరణ్ తిప్పడం.. ఉపాసన మంచు తినడం, ఒక కుక్క పక్కన మంచులో రామ్ చరణ్ పడుకోవడం అన్నీ సరదాగా ఉన్నాయి. ఈ మూమెంట్స్ మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అక్కడి నుండి వచ్చినా కూడా ఇంకా ఆ పర్వతాలను మిస్ అయ్యానంటున్నాడు చరణ్. తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని చెబుతున్నాడు. అక్కడ దిగిన కొన్ని ఫొటోలను పోస్ట్ చేస్తూ మిస్ ద మౌంటైన్స్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. మరి సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండని రామ్ చరణ్ స్పెషల్ గా ఫొటోలు పోస్ట్ చేస్తూ చెబుతున్నాడంటే ఎంత మిస్ అవుతున్నాడో అర్థం చేసుకోవచ్చు.
View this post on Instagram
రామ్ చరణ్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో తను నటించిన క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ విడుదలకి సిద్ధమవుతుంది. దీనితో పాటు తండ్రి చిరంజీవితో కలిసి నటించిన ఆచార్య సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. దీనితో తమిళ స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: