సూర్య ‘ఈటీ’ రివ్యూ

Evariki Thalavanchadu Telugu Movie Review,Suriya,Priyanka Arul Mohan,Vinay Rai,Sathyaraj,Pandiraj,Pandiraj Movie,Hero Suriya,Suriya Movies, Suriya New Movie,Suriya Latest Movie,Suriya New Movie Review,Priyanka Arul Mohan New Movie,Priyanka Arul Mohan Movies,Evariki Thalavanchadu, Evariki Thalavanchadu Movie,Evariki Thalavanchadu Telugu Movie,Evariki Thalavanchadu Movie Updates,Evariki Thalavanchadu Movie Latest Updates, Evariki Thalavanchadu Telugu Movie Updates,Evariki Thalavanchadu Movie Live Updates,Evariki Thalavanchadu Movie Latest News, Evariki Thalavanchadu Review,Evariki Thalavanchadu Movie Review,Suriya Evariki Thalavanchadu,Suriya Evariki Thalavanchadu Movie, Suriya Evariki Thalavanchadu Review,Suriya Evariki Thalavanchadu Movie Review,Evariki Thalavanchadu Public Talk, Evariki Thalavanchadu Movie Public Talk,Evariki Thalavanchadu Public Response,Evariki Thalavanchadu Public Talk And Public Response, Evariki Thalavanchadu Movie Review And Rating,Evariki Thalavanchadu Review And Rating,ET Review And Rating,ET Movie Review And Rating,ET Review, ET Movie Review,ET,ET Movie,ET Telugu Movie,ET Telugu Movie Review,ET Rating,ET Movie Rating,Evariki Thalavanchadu Movie Rating, ET Movie Twitter Review,ET Movie Review And Ratings,ET Twitter Review,ET Official Trailer,ET Trailer,ET Movie Songs,ET Movie Trailer, Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Latest Telugu Movie Reviews 2022,Latest Telugu Reviews,New Telugu Movies 2022,#EvarikiThalavanchadu, #ETReview,#Suriya

పాండి రాజ్ దర్శకత్వంలో సూర్య ఈటీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం వరుస హిట్స్ తో దూసుకుపోతున్న సూర్య నుండి వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది..? హిట్ అయిందా లేదా అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. సూర్య, ప్రియాంక మోహన్, సత్యరాజ్, శరణ్య, వినయ్ రాయ్ ఇంకా తదితరులు
డైరెక్టర్.. పాండిరాజన్
నిర్మాత.. కళానిథి మారన్
బ్యానర్స్.. సన్ పిక్చర్స్, ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్
సంగీతం.. డీ.ఇమ్మాన్
ఎడిటింగ్.. రుబెన్
సినిమాటోగ్రఫి.. రత్నవేలు

కథ..

దక్షిణాపురానికి చెందిన న్యాయవాది కృష్ణమోహన్‌ (సూర్య). తన జీవితంలో జరిగిన ఓ సంఘటన కారణంగా ఆడవాళ్లకు ఏదైనా అన్యాయం జరిగితే సహించలేని మనస్తత్వం కలవాడు. మరోవైపు పొరుగు గ్రామానికి సూర్యకి పడదు. కానీ ఆ ఊరుకి చెందిన అమ్మాయి ప్రియాంకనే సూర్య ప్రేమిస్తాడు. ఇలా సాగిపోతుండగా దక్షిణాపురం టౌన్‌లో కొందరమ్మాయిలు వరుసగా ఆత్మహత్యకు పాల్పడటం.. ప్రమాదాల్లో చనిపోవడం జరుగుతుంటుంది. మరి ఆ నేరాల వెనుక ఉన్నది ఎవరు..? సూర్య వాటిని ఎలా ఛేదించాడు..? ఆ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నది ఈసినిమా కథ..!

సూర్య థియేటర్లలో సందడి చేసి చాలా కాలమే అయింది. కరోనా కారణంగా ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు. ఆ తరువాత ‘జై భీమ్‌’ సినిమా అయినా థియేటర్లలో రిలీజ్ చేస్తారని అనుకున్నారు కానీ ఆసినిమా కూడా ఓటీటీ లోనే రిలీజ్ చేశారు. విశేషం ఏంటంటే ఆ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ‘జై భీమ్‌’ అయితే ఆస్కార్‌ నామినేషన్స్‌లో కూాడా చోటు సంపాదించుకుంది. ఈనేపథ్యంలో అభిమానులు థియేటర్లలో ఆయన సినిమాకోసం ఎదురుచూస్తున్నారు. ఇక వారి ఎదురుచూపులకు ఫైనల్ గా ఈటీ సినిమాతో బ్రేక్ పడింది. నేడు ఈసినిమా థియేటర్లలో రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక సమాజంలో మహిళలు ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.. అన్ని రకాలుగా ఎంత డెవలప్ అవుతున్నా కూడా ఆడవాళ్లపై నేరాలు మాత్రం ఆగడంలేదు. ఈసినిమా కోసం కూడా ఇలాంటి బ్యాక్ డ్రాప్ నే తీసుకున్నాడు పాండిరాజ్. ప్రధమార్ధం నార్మల్ గానే సూర్య, హీరోయిన్ లవ్ ట్రాక్, కామెడీ సన్నివేశాలతో ఉంటుంది.. ఇక ద్వితీయార్థం మొత్తం సినిమా మరో జోనర్‌కి తీసుకుంటుంది. విలన్‌ ఎంట్రీ, మహిళలకు సంబంధించిన ఎమోషన్స్, యాక్షన్‌ ఎపిసోడ్స్ ఎంగేజ్‌ చేస్తాయి. ఈ సినిమా ద్వారా ఓ సీరియస్‌ అంశాన్ని చర్చించాలనుకుని డైరెక్టర్ ప్రయత్నం ఆలోచింపచేస్తుంది.

సూర్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఏ పాత్ర చేసినా సూర్య అవలీలగా నటించేయగలడు. ఇక ఎప్పటిలాగే ఈసినిమాలో కూడా తన నటనతో చెలరేగిపోయాడు. యాక్షన్‌, ఎమోషనల్‌ సన్నివేశాలను చాలా ఇంటెన్స్ తో చేశాడు. మరోసారి మాస్ రోల్ లో నటించి మెప్పించాడు. ప్రియాంక అరుళ్‌మోహన్‌కు మంచి పాత్ర దక్కింది. ఆమె అందంగా కనిపించడంతో పాటు క్లెమాక్స్‌ సన్నివేశాల్లో చక్కటి నటనతో మెప్పించింది. శరణ్య, సత్యరాజ్‌ తమ పాత్రల పరిధుల మేరకు న్యాయం చేశారు. వినయ్‌రాయ్‌ విలన్‌గా పర్వాలేదనిపించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల మేర నటించారు.

ఇక సాంకేతిక విభాగానికి వస్తే ఇమ్మాన్ ఈసినిమాకు సంగీతం అందించగా.. పాటలు అంతంత మాత్రమే ఉన్నా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం బాగుంది. కొన్ని కొన్ని సన్నివేశాలకు బీజీయమ్ వల్ల మరింత ఎలివేషన్ వచ్చింది. రత్నవేలు సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే సూర్య అభిమానులకు అలానే ఇలాంటి జోనర్ లో సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఈసినిమా నచ్చుతుంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 16 =