సన్ పిక్చర్స్ బ్యానర్ పై పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “ఈటీ” (ఎతరుక్కుమ్ తునిందవన్)తమిళ మూవీ , తెలుగు వెర్షన్ “ఎవరికీ తలవంచడు ” మార్చి 10 వ తేదీ రిలీజ్ కానున్నాయి. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. డి ఇమాన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నారాయణ్‌దాస్ నారంగ్, డి. సురేష్‌బాబు, ‘దిల్’ రాజు ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఈటీ” (ఎవరికీ తలవంచడు)మూవీ రిలీజ్ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ .. ఈ మూవీ లో చాలా శక్తివంతమైన పాత్ర లో నటించాననీ , హీరో సూర్య సర్‌తో సమానమైన పాత్ర తనదనీ , నేటి సమాజంలో అమ్మాయిలు చాలా విషయాలు బయటకు చెప్పుకోలేక పలు రకాలుగా ఇబ్బంది పడుతున్నారనీ , . వాటన్నింటినీ చర్చించే చిత్రమిదనీ , అమ్మాయిలను ఎడ్యుకేట్ చేసే సన్నివేశాలు చాలా ఉన్నాయనీ , ఇది ఒక మంచి కుటుంబ కథా చిత్రం అనీ చెప్పారు. హీరో నాని “గ్యాంగ్ లీడర్ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన ప్రియాంక “శ్రీకారం “మూవీ తో ప్రేక్షకులను అలరించారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























