కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి , రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన “ఆచార్య “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ రిలీజ్ కానుంది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం “మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ కానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ”#RC15” మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. #RC15” మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ పూణె , సెకండ్ షెడ్యూల్ రాజమండ్రి లో కంప్లీట్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో చాలా రోజుల తరువాత ఫిన్ ల్యాండ్ కు విహార యాత్రకు వెళ్ళారు . చరణ్ ప్రస్తుతం వైఫ్ ఉపాసన తో కలిసి ఫిన్ ల్యాండ్ లో విహరిస్తూ అక్కడి అందాలని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మంచు తివాచీ పరిచినట్టుగా ఉన్న ప్రదేశంలో ఉపాసనతో కలిసి రామ్ చరణ్ ఫొటోకు పోజులిచ్చారు. ఆ ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో రామ్ చరణ్ షేర్ చేయగా వైరల్ గా మారాయి. కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఎలాంటి వెకేషన్ కి వెళ్లని ఈ మెగా జోడీ తాజాగా ఫిన్ ల్యాండ్ లో ఎంజాయ్ చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: