తన పెళ్లి వార్తలపై ‘రష్మిక మందన్న’ రియాక్షన్..!

Rashmika Mandanna Talks About Her Marriage,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Rashmika Mandanna,Rashmika Mandanna Movies,Rashmika Mandanna latest Movies,Rashmika Mandanna Upcoming Movies in 2022,Rashmika Mandanna Tollywood Movies, Rashmika Mandanna Telugu Movies,Rashmika Mandanna Latest Super Hit Movies,Rashmika Mandanna New look,Rashmika Mandanna Photos,Rashmika Mandanna About HEr Marriage, Rashmika Mandanna Comments on her Marriage,Rashmika Mandanna Allu Arjun Movie Pushpa the Rise,Rashmika Mandanna in Pushpa the Rise Movie,Rashmika Mandanna Aadavallu Meeku Johaarlu, Rashmika Mandanna Upcoming movie Aadavallu Meeku Johaarlu,Aadavallu Meeku Johaarlu Rashmika Upcoming Movie,Actress Rashmika Mandanna Aadavallu Meeku Johaarlu on March 4th,Rashmika Mandanna and Sharwanand Movie Aadavallu Meeku Johaarlu, #AadavalluMeekuJohaarlu,#Rashmikamandanna

హీరో హీరోయిన్లపై రూమర్స్ రావడం అనేది గ్లామర్ ప్రపంచంలో చాలా ఈజీగా జరిగే పని. అందులోనూ ముఖ్యంగా వారి వ్యక్తిగత విషయాలపై అందరికీ ఇంకాస్త ఎక్కువగానే ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి.. ఏదైనా ఛాన్స్ దొరికితే చాలు వారి వ్యక్తిగత విషయాలపైనే రూమర్స్ పుట్టించేస్తుంటారు. ఇక సెలబ్రిటీలు కూడా మొదట వాటికి కొంత బాధపడినా ఆ తరువాత వారు కూడా పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ వెళిపోతుంటారు. ఇక తాజాగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక మందన్న కూడా తనపై వచ్చిన వార్తలను చాలా ఈజీగా కొట్టిపారేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఛలో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మిక మందన్న ఆ సినిమా తరువాత అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతోంది. అయితే సినిమాల పరంగా రష్మిక టాప్ లోఉన్నా..తన వ్యక్తిగత జీవితంపై మాత్రం ఏదో ఒక వార్త తెరపైకి వస్తూనే ఉంటుంది. కెరీర్ ప్రారంభంలోనే రక్షిత్ శెట్టితో ఎంగేజ్ మెంట్ అయింది. ఇక కొద్ది రోజుల్లో పెళ్లి అయిపోతుంది అనుకునే లోపు అది క్యాన్సిల్ అయిపోయింది. ఇక ఆతరువాత రష్మిక కూడా కెరీర్ పై ఫోకస్ పెట్టడం.. టాప్ హీరోయిన్ అయిపోవడం జరిగిపోయింది. అయితే ఈ గ్యాప్ లో విజయ్ దేవరకొండ-రష్మిక పై పలు రూమర్స్ వచ్చాయి. వీరిద్దరూ కలిసి గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు చేయగా.. అప్పటి నుండి వీరిద్దరిపై వార్తలు మొదలయ్యాయి. ఇక రీసెంట్ గా విజయ్ దేవరకొండతో పెళ్లి అన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్తలపై తాాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మికను ప్రశ్నించగా.. అవన్నీ కేవలం టైంపాస్ కోసం వచ్చే వార్తలు మాత్రమే.. నేను ఇప్పుడు పెళ్లి చేసుకునే మూడ్ లో లేను.. నా పెళ్లికి ఇంకా చాలా టైం ఉంది అంటూ ఆవార్తలను కొట్టిపారేసింది. మరి ఇప్పటికైనా ఆ వార్తలకు బ్రేక్ పడుతుందేమో చూద్దాం..

ఇక సినిమాల విషయానికొస్తే ఇటీవలే పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పుడు శర్వానంద్ హీరోగా నటిస్తున్న “ఆడవాళ్ళు మీకు జోహార్లు” అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా మార్చి 4న విడుదలకు సిద్ధమవుతోంది. మరి ఈసినిమాతో కూడా మరో హిట్ ను కొడుతుందేమో చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =