సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి కలిసి నటించిన లేటెస్ట్ మూవీ భీమ్లానాయక్. పేరుకు మాత్రమే ఈసినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్.. కానీ చాలా వరకూ కథలో మార్పులు చేసి.. తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టు సినిమా తీశారు. ఇక అదే ఇక్కడ వర్కవుట్ అయి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. త్రివిక్రమ్ డైలాగ్స్, పవన్-రానాల స్క్రీన్ ప్రెజెన్స్, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా అన్నీ తోడై.. సినిమా విజయంలో భాగమయ్యాయి. అందుకే భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి ఆటతోనే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని దూసుకుపోతోంది. మొదటిరోజే సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాడు భీమ్లా నాయక్. పలు చోట్ల రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి.. కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. ఫస్ట్ డే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇక ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో.. ఏ ఏరియాలో ఎంత కలెక్షన్స్ రాబట్టాయో చూద్దాం..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నైజాం – 11.85 కోట్లు
సీడెడ్ – 3.28 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.88 కోట్లు
ఈస్ట్ – 1.95 కోట్లు
వెస్ట్ – 1.02 కోట్లు
గుంటూరు – 2.51 కోట్లు
కృష్ణా – 0.89 కోట్లు
నెల్లూరు – 1.04 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 3.10 కోట్లు
ఓవర్సీస్ – 6.85 కోట్లు
మొత్తంగా భీమ్లానాయక్ వరల్డ్ వైడ్ గా 36 కోట్లకు పైగా షేర్ అలానే 56 కోట్లకు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
మరి ఏపీలో ప్రస్తుతం టికెట్ల ఇష్యూ నడుస్తుంది. చాలా థియేటర్లు మూతపడ్డాయి కూడా. ఏపీలో కూడా అనుకూల పరిస్థితులు ఉంటే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ రాబడుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































