ఒకనాటి అందాలతార శ్రీదేవి తెలుగు చిత్ర పరిశ్రమలో తన సినిమాలతో ఎన్నో ఏళ్లు ఏలారు. కేవలం తెలుగు మాత్రమే కాదు తెలుగు, తమిళ్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాలు చేశారు. ఇక శ్రీదేవి చనిపోయిన తరువాత ఇప్పుడు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే జాన్వీ కపూర్ ఎంట్రీపై ఎన్నో వార్తలు వచ్చాయి. మహేష్ బాబు కు జోడీ అన్నారు.. రామ్ చరణ్ తో అన్నారు.. కానీ అవన్నీ వార్తలకే పరిమితమయ్యారు. ఇక రీసెంట్ గా ఎన్టీఆర్ కు జోడీగా జాన్వీ నటించే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా ఈ వార్తలపై స్పందిస్తూ
జాన్వీ తండ్రి, నిర్మాత బోనీ కపూర్ క్లారిటీ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా వచ్చిన సినిమా వలిమై. ఇక ఈసినిమాకు బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న బోనీ కపూర్ ను టాలీవుడ్ ఎంట్రీ గురించి అడగగా.. ఎన్టీఆర్ సినిమాలో జాన్వీ నటిస్తుందనేది కూడా అలాంటి ఓ రూమర్ మాత్రమే.. సోషల్ మీడియాలో రోజుకో పుకారు పుట్టుకొస్తూనే ఉంటుంది..అని బోనీ కపూర్ క్లారిటీ ఇచ్చారు. ఇంకా తెలుగు ప్రేక్షకుల్లో శ్రీదేవికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అందుకే జాన్వీ ఎప్పుడూ తెలుగు సినిమాలో నటిస్తుందని చాలామంది అభిమానులు అడుగుతున్నారు. ఇక్కడి అభిమానులు మాకు ఎంతో ప్రత్యేకం. అందుకే మీ అందరి కోరిక మేరకు కచ్చితంగా టాలీవుడ్ సినిమాలో తను నటించాలని నేనూ కోరుకుంటున్నాను అని తెలిపారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: