మొత్తానికి అటు అజిత్ ఫ్యాన్స్ తో పాటు తమిళ్, తెలుగు సినీ లవర్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన వలిమై సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అజిత్ సినిమా కాబట్టి ఎలాగూ అంచనాలు ఉంటాయి. దానికితోడు ఈ సినిమా ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ అవ్వడం.. యంగ్ హీరో కార్తికేయ విలన్ రోల్ లో నటించడం.. అందుకు తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్ కు కూడా భారీగా రెస్పాన్స్ రావడంతో సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ మరింత ఎక్కువయ్యాయి. మరి నేడు రిలీజ్ అయిన ఈసినిమా ఎలా ఉంది.. ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది.. అన్న విషయం తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు: అజిత్, కార్తికేయ, హ్యుమ ఖురేషి, బాని జే, యోగి బాబు తదితరులు
దర్శకత్వం: హెచ్ వినోద్
నిర్మాత: బోనీ కపూర్
బ్యానర్లు: జీ స్టూడియోస్, బే వ్యూ ప్రాజెక్ట్స్
సంగీతం: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ: నిరావ్ షా
కథ..
అర్జున్ (అజిత్) పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తుంటాడు. మరోవైపు నిరుద్యోగులతో చైన్స్ దొంగతనం చేస్తూ, బైక్ రేసింగ్స్ చేసే ఓ ముఠా చేసే అరాచకాల వల్ల చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటారు. అయితే ఆ ముఠాను నడిపించేది నరేన్ (కార్తికేయ) అని తెలుసుకుంటాడు అర్జున్. మరి ఆ ముఠా అరాచకాలను అర్జున్ ఎలా అడ్డుకున్నాడు.. నరేన్ (కార్తికేయ) అన్నదే ఈసినిమా కథ.
విశ్లేషణ..
ప్రస్తుతం మన సౌత్ సినిమాలు కూడా ఎక్కడా తగ్గట్లేదు. మేకింగ్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా సినిమాలు తీయడానికి ముందకొస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు రాగా నేడు బోనీ కపూర్ నిర్మించిన భారీ బడ్జెట్ మూవీ వలిమై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈసినిమా కూడా సూపర్ టాక్ ను సొంతం చేసుకుంటుంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. హాలీవుడ్ యాక్షన్ చిత్రాలను మరిపించే రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కించారు. హెచ్ వినోద్, అజిత్, బోనీ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా ఇది. నెర్కొండ పార్వాయి సినిమా హిట్ అవ్వడంతో వెంటనే ఈసినిమాను లైన్ లో పెట్టారు. ఇక రెండో సినిమాతో కూడా మంచి హిట్ ను ఖాతాలో వేసుకున్నట్టే అనిపిస్తుంది.
వలిమై ఒక కంప్లీట్ యాక్షన్ చిత్రం. బైక్ రేస్ ముఠా అక్రమాలు నేపథ్యంలో ఇప్పటివరకూ పెద్దగా సినిమాలు రాలేదని చెప్పొచ్చు. అదే ఈసినిమాకు ప్లస్ పాయింట్. కథ సంగతి పక్కన పెడితే.. వినోద్ ఈ చిత్రంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ఛేజింగ్ సీన్లు డిజైన్ చేశారు. ఫస్ట్ హాఫ్ ఫుల్ బైక్ చేస్ లతో హాలీవుడ్ సినిమాని తలపించేలా తెరకెక్కించాడు. ఇంక ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చే బైక్ చేజ్ సీక్వెన్స్ అయితే గూస్ బంప్స్ అనే చెప్పాలి. సీట్ ఎడ్జ్ కూర్చోబెడుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఇంక సెకండ్ హాఫ్ లో వచ్చే మదర్ సెంటిమెంట్ ఎమోషనల్ సీన్స్ బాగా పండాయి అని చెప్పాలి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే బస్సు ఫైట్ అయితే హాలీవుడ్ యాక్షన్ సీన్ ని తలపిస్తుంది.
ఇక ఈసినిమాకు ప్రధాన బలం హీరో అజిత్, ఇంకా విలన్ గా చేసిన కార్తికేయ. అజిత్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈసినిమాలో నటన కంటే కూడా అజిత్ చేసిన యాక్షన్ సన్నివేశాలు.. బైక్ రేసులు మాత్రం స్పెషల్ ఎట్రాక్షన్. అయితే అజిత్ స్వతహాగా మంచి బైక్ రేసర్ కావడంతో ఇందులో అనేక సీన్స్ చాలా బాగా వచ్చాయి. అజిత్ కు తగ్గట్టే కార్తికేయ కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. గ్యాంగ్ లీడర్” తర్వాత మళ్లీ ఒక విలన్ పాత్రలో కార్తికేయ చాలా బాగా నటించాడు. విలన్ గా కూడా తెరపై అద్భుతమైన నటన కనబరిచాడు కార్తికేయ. హ్యూమా ఖురేషి కి కూడా ఈ సినిమాలో కీలక పాత్ర లభించింది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆమె కూడా చాలా బాగా నటించింది. యోగి బాబు కామెడీ బాగానే వర్కౌట్ అయింది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.
సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం సినిమాకి అతి పెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రాఫర్ నిరవ్ షా ఈ సినిమాకి మంచి విజువల్స్ ను అందించారు. వీరితో పాటు స్టంట్ మాస్టర్స్ కు కూడా స్పెషల్ క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఫైట్స్, ఛేజింగులు హాలీవుడ్ రేంజ్ లో తీశారు.
ఇక ఓవరాల్ గా చెప్పాలంటే యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి ఈసినిమా పండగ అని చెప్పొచ్చు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: