దిల్ రాజు ప్రొడక్షన్స్ , గుణ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత , దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” తెరకెక్కిన విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైమ్ నటిస్తున్న ఈ మైథలాజికల్ మూవీ లో అదితి బాలన్ , మోహన్ బాబు , ప్రకాష్ రాజ్ , కబీర్ దుహన్ సింగ్ , అల్లు అర్హ ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“శాకుంతలం ” మూవీని పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. తాజాగా చిత్రయూనిట్ “శాకుంతలం ” మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో శకుంతల గా సమంత లుక్ ఇంప్రెసివ్ గా ఉండి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.మహాకవి కాళిదాసు నాటకం ఆధారంగా “శకుంతల” కథ రూపొందింది. 1943 సంవత్సరంలో దిగ్గజ దర్శక, నటుడు శాంతారామ్ ఈ కథను హిందీ లో సినిమాగా తీశారు. ఇదే కథ ఆధారంగా 1966లో ఎన్ టీ రామారావు , సరోజా దేవి నటించిన “శకుంతల” అనే తెలుగు చిత్రం తెరకెక్కింది. ఇప్పుడు ఆ కథ నే దర్శకుడు గుణ శేఖర్ భారీ బడ్జెట్ , భారీ సెట్స్ , మోడరన్ విజువలైజేషన్ తో “శాకుంతలం” మూవీ తెరకెక్కించారు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: