హిట్టు ఫ్లాపులతో పని లేకుండా వరస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు యంగ్ హీరో శర్వానంద్. ప్రస్తుతం శర్వానంద్ నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్ళు మీకు జోహార్లు`. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈసినిమా ఈనెల 25న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు మేకర్స్. ఇక టైటిల్ తోనే సినిమాపై బజ్ క్రియేట్ చేసిన చిత్రయూనిట్.. పాటలు, టీజర్‌తో ఈ సినిమా మీద అంచనాలు మరింత పెంచేశారు. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ చెయ్యడానికి డేట్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ని ఈ ఫిబ్రవరి 19న రిలీజ్ చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Entertainment ki johaarlu kottadaniki ready na mari? 😎#AadavalluMeekuJohaarlu Trailer on FEB 19 ❤️#AMJOnFEB25@iamRashmika @DirKishoreOffl @ThisIsDSP @sujithsarang @SLVCinemasOffl @LahariMusic @TSeries pic.twitter.com/PI8K9OnaHF
— Sharwanand (@ImSharwanand) February 17, 2022
ఇంకా ఈసినిమాలో వెన్నెల కిశోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోపరాజు, బెనర్జీ, కల్యాణీ, నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్యకృష్ణ, ఆర్‌సీఎమ్ రాజు తదితరులు నటిస్తున్నారు.జాతీయ అవార్డులు సాధించిన శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకు సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: