మెగా స్టార్ చిరంజీవి గత కొన్ని సంవత్సరాలుగా అయ్యప్ప దీక్షను తీసుకుంటున్న విషయం తెలిసిందే. శబరిమల లో మండల పూజ, మకరజ్యోతి సమయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.ఆ సమయంలో కుదరకపోవడంతోనే ఇప్పుడు చిరంజీవి దంపతులు శబరిమల యాత్రకు వెళ్లారు. మాస పూజ సందర్భంగా ఈ నెల 12 వ తేదీ నుండి 17 తేదీ వరకూ అయ్యప్ప స్వామి దేవాలయం తెరచి ఉంచుతారు. కాగా డోలీలో శబరికొండకు చేర్చిన డోలీ కార్మికులకు మెగాస్టార్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వారితో కాసేపు ముచ్చటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగాస్టార్ చిరంజీవి దంపతులు 13 వ తేదీ ( ఆదివారం) శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. చాలాకాలం తర్వాత శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నాననీ , భక్తుల రద్దీ, అభిమానుల తాకిడి కారణంగా కాలి నడకన కాకుండా డోలీలో స్వామి సన్నిధికి చేరుకోవాల్సి వచ్చిందనీ , స్వామి పుణ్య దర్శనానికి భక్తుల కోసం తమ శ్రమను ధారపోస్తున్న డోలీ సోదరులకు తన హృదయాంజలి అనీ, ఈ ప్రయాణంలో చుక్కపల్లి సురేశ్, గోపీ కుటుంబాల తోడు మంచి అనుభూతినిచ్చిందనీ చిరంజీవి ట్వీట్ చేస్తూ కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: