అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో 2019లో విడుదలైన ‘ఎఫ్2’ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో వెంకటేష్, వరుణ్ పోటీపడి మరీ నటించి..ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో దానికి సీక్వెల్ గా ఎఫ్ 3 సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. నిజానికి ‘ఎఫ్3’ సినిమా కూడా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే కదా. మొదట మార్చి 25 లేదా ఏప్రిల్ 29 అంటూ రెండు ఆప్షన్స్ ఇచ్చారు. తరువాత ఆర్ఆర్ఆర్ మార్చి 25నే రిలీజ్ చేస్తామని ప్రకటించడంతో ఎఫ్ 3 సినిమా రిలీజ్ డేట్ ను ఏప్రిల్ కు మార్చారు. ఏప్రిల్ 28నే ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ఎఫ్ 3 మేకర్స్ ప్రకటించారు. అయితే ఏమైందో ఇప్పుడు మళ్లీ రిలీజ్ డేట్ ను మార్చారు. కొత్త రిలీజ్ డేట్ ను మారుస్తూ అధికారికంగా ప్రకటించారు. పిల్లలు పరీక్షలు ముగించుకోండి..పెద్దలు సమ్మర్ సందడికై తయారుకండి.. ఫన్ పిక్నిక్ కి డేట్ ఫిక్స్ చేశాం అంటూ మరోసారి రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు. మే27 న ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
పిల్లలు పరీక్షలు ముగించుకోండి🤩
పెద్దలు సమ్మర్ సందడికై తయారుకండి🔥ఫన్ పిక్నిక్ కి డేట్ ఫిక్స్ చేశాం!🔐
No change in date Anymore! 😎
Most Awaited FUN Franchise
➡️ #F3Movie ON MAY 27th🥳#F3OnMay27@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @ThisIsDSP @SVC_official @adityamusic pic.twitter.com/PTjLnKvQbF— Sri Venkateswara Creations (@SVC_official) February 14, 2022
కాగా ఈసినిమాలో వెంకటేష్ కు జోడీగా తమన్నా, వరుణ్ కు జోడీగా మెహ్రీన్ నటిస్తుండగా.. రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్, రఘుబాబు, తులసి తదితరులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్‌రాజు సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: