టాలీవుడ్ లో బాలీవుడ్ హీరోయిన్స్ సందడి

Bollywood Heroines Busy with Tollywood Projects,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Bollywood Heroines Busy with Tollywood Movies,Bollywood Heroines in Tollywood,Kiara Advani in Ram charan Movie,Kiara Advani with Ramcharan New Movie #RC 15,Ramcharan #RC 15 Movie, Ananya Panday with Vijay Deverakonda,Ananya Panday in Liger Movie,Liger on 25th August,Deepika Padukone in Tollywood Movie Project K,Deepika Padukone with Prabhas Movie Project K,Deepika Padukone Project K Movie, Alia Bhatt in Ranam Roudra Rudhiram Movie,Alia Bhatt In RRR Movie,Alia Bhatt with Ram charan,Alia Bhatt in #NTR30 Movie,Saiee Manjrekar with Varun Tej In Gani Movie,Saiee Manjrekar Upcoming Movie Gani, Major Saiee M Manjrekar on May 27th,#Bollywood

టాలీవుడ్ లో పలు పాన్ ఇండియా మూవీస్ తెరకెక్కడం, దేశవ్యాప్తం గా తెలుగు సినిమా గుర్తింపు పొందడం , మూవీస్ సక్సెస్ రేట్ వంటి కారణాలతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ తెలుగు మూవీస్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే రెండు తెలుగు మూవీస్ లో కథానాయికగా నటించిన కియారా అద్వానీ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న “#RC 15 “మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దీపిక పడుకొనే జంటగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K ” తెరకెక్కుతుంది.ఈ మూవీ తో దీపిక టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నటించాలనే కోరిక ను దీపిక వెల్లడించారు. డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన “రౌద్రం రణం రుధిరం”మూవీ తో అలియా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు . “NTR30 “మూవీ కి అలియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో నటించాలని ఉందని అలియా చెప్పిన విషయం తెలిసిందే.

పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ , అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో సాలా క్రాస్‌బ్రీడ్‌ క్యాప్షన్ తో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్ “మూవీ 2022 ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీతో అనన్య పాండే టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామాగా “గని “మూవీ ఫిబ్రవరి 25 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తో సాయీ మంజ్రేకర్ టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, సాయీ మంజ్రేకర్ జంటగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన “మేజర్” మూవీ మే 27 వ తేదీ రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 5 =