చిన జీయర్ స్వామి పర్య వేక్షణలో హైదరాబాద్ ముచ్చింతల్ లో సమతామూర్తి శ్రీ రామాన్యుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ముచ్చింతల్ దివ్యక్షేత్రం లో ప్రపంచంలోనే అతి పెద్దదైన శ్రీ రామానుజాచార్యుల 216 అడుగుల విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించి జాతికి అంకితం ఇచ్చారు. ఆ దివ్య క్షేత్రం లో యాగ శాలలు దర్శించి పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా ప్రధాని మోదీ టాలీవుడ్ పై ప్రశంసలు కురిపించారు. ఆయన మాట్లాడుతూ .. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించిందనీ , తెలుగు సినీ పరిశ్రమ అతి పెద్ద పరిశ్రమగా రూపొందిందనీ , తెలుగు సినిమా సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతాలు సృష్టిస్తోందనీ , సిల్వర్ స్క్రీన్ నుంచి ఓటీటీ వరకు తెలుగు సినిమాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుందనీ , తెలుగు భాష చరిత్ర ఎంతో సుసంపన్నమైందని అంటూ ప్రధాని అంటూ టాలీవుడ్ పై ప్రశంసలు కురిపించారు. ఒకప్పుడుఇండియన్ మూవీ అంటే బాలీవుడ్ మూవీ యే అనుకునేవారు. “బాహుబలి” , “బాహుబలి 2 ” మూవీస్ తో తెలుగు సినిమా గుర్తింపు పొందింది. ఇప్పుడు “పుష్ప ” మూవీ తో నిరూపణ అయ్యింది.
Honorable Prime Minister #NarendraModi great words about Telugu Cinema!! ❤️👏👏#StatueOfEquality #TeluguCinema #Tollywood #Modi #TeluguFilmNagar https://t.co/cb0TaGj7jx
— Telugu FilmNagar (@telugufilmnagar) February 5, 2022
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: