అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నేడు జరగనున్న సంగతి తెలిసిందే కదా. ఇంగ్లడ్ టీమ్ తో జరగనున్న ఈ మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో ఇండియా టీమ్ కు అందరూ బెస్ట్ విషెస్ చెబుతున్నారు. ఇక సీనియర్ క్రికెటర్లు కూడా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ ధైర్యాన్ని ఇస్తున్నారు. దీనిలో భాగంగానే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా టీమ్ కు విషెస్ అందించారు. మహేష్ తన ట్విట్టర్ ద్వారా ఈ అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో భారత యువ జట్టుకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు. పోరాడి మన దేశానికి ట్రోఫీని తీసుకురండి అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా ఆంటిగ్వాలోని నార్త్ సౌండ్ లో జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ కు సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా నిలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Wishing our #IndiaU19 team all the best for the World Cup final today! Go on and bring home the trophy! 🏆
— Mahesh Babu (@urstrulyMahesh) February 5, 2022
ప్రస్తుతం మహేష్ పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట‘ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. మెుదట ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేద్దామని మేకర్స్ ప్లాన్ చేశారు.. కానీ ఆతరువాత ఏప్రిల్ 1వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.ఇక కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియోలు సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
ఇక దీనితో పాటు మహేష్ త్రివిక్రమ్ తో సినిమా చేయనున్న సంగతి కూడా విదితమే. రెండు రోజుల క్రితమే ఈసినిమాను కూడా లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. మహర్షి సినిమాలో మహేష్ కు జోడీగా చేసిన పూజా హెగ్డేనే ఈసినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. సర్కారు వారి పాట సినిమా పూర్తయిన వెంటనే ఈసినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























