అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రం “డీజే టిల్లు”- నేహా శెట్టి

Neha Shetty Opens about her upcoming film DJ Tillu

సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ , “మెహబూబా “, “గల్లీ రౌడీ “మూవీస్ ఫేమ్ నేహా శెట్టి జంటగా తెరకెక్కిన “డీజే టిల్లు” మూవీ ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. ప్రిన్స్ , బ్రహ్మాజీ , ప్రగతి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి థమన్ ఎస్ , శ్రీ చరణ్ పాకాల , రామ్ మిర్యాల సంగీతం అందించడం విశేషం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ఈ మూవీ పై హైప్ ను క్రియేట్ చేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“డీజే టిల్లు” మూవీ రిలీజ్ సందర్భంగా నేహా శెట్టి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. “డీజే టిల్లు”లో నిజాయతీ, ఆత్మ విశ్వాసంతో కూడిన ఈతరం అమ్మాయి రాధిక పాత్రలో నటించాననీ, రాధిక పాత్రలో సహజంగా నటించాననీ , సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ఎక్కువ ఉంటుందనీ , ఇలాంటి పాత్రను ఇప్పటివరకూ సినిమాల్లో చూడలేదనీ , వినోదం, ఉత్కంఠ, రొమాన్స్,  కమర్షియల్ హంగులు అన్నీ సినిమాలో ఉన్నాయనీ , “డీజే టిల్లు” కథ విన్నప్పుడు చాలా నవ్వుకున్నాననీ,  తెలంగాణ యాస వినడం తనకు కొత్త అనీ , కామెడీ సీన్స్ చేస్తున్నప్పుడు ఇంకా చాలా కొత్తగా ఫీలయ్యాననీ , తెలంగాణ యాసలో ఇంకా చాలా సినిమాలు రావాలనీ , అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రం “డీజే టిల్లు” అనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.