దిల్ రాజు ప్రొడక్షన్స్ , గుణ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత , దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” తెరకెక్కిన విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైమ్ నటిస్తున్న ఈ మైథలాజికల్ మూవీ లో అదితి బాలన్ , మోహన్ బాబు , ప్రకాష్ రాజ్ , కబీర్ దుహన్ సింగ్ , అల్లు అర్హ ముఖ్యపాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ కానున్న “శాకుంతలం “మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సూపర్ హిట్ “ఫ్యామిలీ మెన్ 2 “హిందీ వెబ్ సిరీస్ లో సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ “పుష్ప :ది రైజ్”మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకులను అలరించారు. ఒక హిందీ మూవీ కి కూడా సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. బాలీవుడ్ లో సమంత కు ఉన్న క్రేజ్ కు తగ్గట్టుగా”శాకుంతలం “మూవీని హిందీ లో అత్యంత భారీగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: