మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ త్వరలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా ప్రమోషన్ లో భాగంగా చరణ్ ముంబై టు హైద్రాబాద్ తిరుగుతూనే ఉన్నారు. అంతేకాదు ముంబై లో రామ్ చరణ్ కు ఒక బంగ్లా ఉన్న సంగతి కూడా ఇప్పటికే అందరికీ తెలుసు. తాజాగా శ్రీజ కూడా అన్నయ్య రామ్ చరణ్ తో ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే కదా. అనుకోకుండా చెల్లెలు శ్రీజతో కలిసి చరణ్ ముంబై లో కనిపించడంతో ఇక్కడ ఫోటోగ్రాఫర్లు వరుస పెట్టి ఫోటోలు తీశారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యాయో చూశాం. ఇక ఈ సందర్భంగా అన్న చరణ్ ఇంకా పెట్ డాగ్ తో ఉన్న ఫొటోను పోస్ట్ చేస్తూ.. హగ్స్ ఇంకా కడల్స్.. నేను బతకడానికి నాకు ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చే చిన్న చిన్న విషయాలివే అంటూ పోస్ట్ లో పేర్కొంది. ఈ పోస్ట్ చూస్తుంటే శ్రీజ కాస్త ఎమోషనల్ అయినట్టే అర్థమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
కాగా చరణ్ కూడా స్పీడ్ పెంచుతున్నాడు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ వల్ల మరోవైపు కరోనా వల్ల దాదాపు మూడేళ్లు స్క్రీన్ కు దూరమయ్యాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 15వ సినిమా షూటింగ్ ను మళ్లీ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఈసినిమా తరువాత చాలా సినిమాలు చరణ్ లిస్ట్ లో ఉన్నాయి. వాటిని కూడా ఫైనలైజ్ చేసి త్వరలోనే స్టార్ట్ చేయాలని చూస్తున్నాడట చరణ్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: