పోల్ గేమ్ : రాబోయే సీక్వెల్స్ లో ఏ మూవీకి మీఓటు ?

For Which Among These Sequel Movies You Are More Excited?,POLL Game,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2022,POLL,TFN POLL,Telugu Movies Sequel 2022,Telugu Movie Sequel,Upcoming New Telugu Movie Sequel Releases,Upcoming Telugu Movie Sequel,2022 Telugu Movie Sequel,Upcoming Telugu Movies,Upcoming Tollywood Movies,Telugu Movies Releasing This Week,Upcoming Telugu Movies 2022,New Telugu Movies Sequel 2022,Upcoming Telugu Movies Release 2022,Telugu Movies,New Telugu Movies,New Telugu Movies 2022,Upcoming Tollywood Movie,Sequel Movies,Telugu Sequel Movies,Latest Telugu Sequel Movies,Upcoming Telugu Sequel Movies,Upcoming Telugu Sequel Movies 2022,2022 Sequel Movies,2022 Upcoming Telugu Sequel Movies,Latest Telugu Movies 2022,The Most Anticipated Telugu Movie Sequels In 2022,Telugu Movie Sequels In 2022,2022 Telugu Movie Sequels,Telugu Movie Sequels 2022,New Telugu Sequels Movies 2022,Upcoming Telugu Movies Sequel,Upcoming Sequels In Telugu 2022,Telugu Movie Sequels Releasing In 2022,Pushpa The Rule,Allu Arjun,Pushpa,Pushpa Movie,Pushpa The Rule Movie,F3,F3 Movie,F2 Sequel,F3 Telugu Movie,KGF2,KGF,KGF2 Movie,KGF Chapter 2,KGF Chapter 2 Movie,Goodachari,Goodachari Movie,Goodachari 2,Goodachari 2 Movie,Venkatesh,Varun Tej,Yash,Adivi Sesh,#PushpaTheRule,Sequel Movies In Telugu 2022,#F3,#KGF2,#Goodachari2

పుష్ప :ది రూల్: మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా సుమారు 300కోట్లు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. తెలుగు ,తమిళ , కన్నడ , మలయాళ, హిందీ భాష ల ప్రేక్షకులు “పుష్ప ” మూవీ కి బ్రహ్మరథం పడుతున్నారు. అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల , సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ సెకెండ్ పార్ట్ “పుష్ప :ది రూల్” త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

F 3: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అదే కాంబినేషన్ లో “F 3” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో అంజలి , రాజేంద్ర ప్రసాద్ , సునీల్ , మురళీశర్మ , సంగీత, సోనాల్ చౌహాన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , దసరా స్పెషల్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “F 3” మూవీ ఏప్రిల్ 28 వ తేదీ రిలీజ్ కానుంది.

కె జి ఎఫ్ చాప్టర్ 2: హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాఫ్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ ఏప్రిల్ 14 వతేది భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హీరో యష్ బర్త్ డే (జనవరి 8 )సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ టీజర్ 235 మిలియన్ పైగా వ్యూస్ తో యూట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

గూఢచారి 2 : అభిషేక్ పిక్చర్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , విస్టా డ్రీమ్ మర్చెంట్స్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ , శోభిత ధూళిపాళ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ స్పై థ్రిల్లర్ “గూఢచారి ” మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ కి స్టోరీ తో పాటు స్క్రీన్ ప్లే లో అడివి శేష్ సహకారం అందించడం విశేషం. ఈ మూవీ కి సీక్వెల్ అనౌన్స్ మెంట్ జరిగిన విషయం తెలిసిందే. తెలుగు, హిందీ భాషలలో అడివి శేష్ హీరోగా తెరకెక్కిన “మేజర్ ” మూవీ కారణంగా “గూఢచారి 2 “మూవీ లేట్ అయ్యింది. “గూఢచారి 2 “మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.

పోల్ గేమ్ : రాబోయే సీక్వెల్స్ లో ఏ మూవీకి మీఓటు ?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + two =