కరోనా వల్ల ఇప్పటికే చాలా సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో సినిమా కూడా చేరిపోయింది. ఆ సినిమానే మేజర్. అడివి శేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా మేజర్. పాన్ ఇండియా రేంజ్ లో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈసినిమాను కూడా ఫిబ్రవరి 11న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈసినిమాను కూడా వాయిదా వేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా చిత్రయూనిట్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. కొన్ని చోట్ల కర్ఫ్యూ, మరికొన్ని చోట్ల కరోనా ఆంక్షలు ఉన్న నేపథ్యంలో సినిమాను వాయిదా వేస్తున్నాం. ఈసినిమా కేవలం ప్రాంతీయ సినిమా కాదు.. ఇండియా సినిమా.. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ సినిమా చూడాలి..దేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తరువాతే సినిమాను రిలీజ్ చేస్తాం.. త్వరలోనే మరో విడుదల తేదీని ప్రకటిస్తాం. అప్పటి వరకూ అందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ.. క్షేమంగా ఉండండి. అంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
The release of #MajorTheFilm stands postponed owing to the pandemic.
The new release date would be announced at the earliest possible time.@AdiviSesh @saieemmanjrekar @SashiTikka #SriCharanPakala @sonypicsindia @urstrulyMahesh @GMBents @AplusSMovies @zeemusicsouth pic.twitter.com/sQJd8cGA6D
— GMB Entertainment (@GMBents) January 24, 2022
కాగా ముంబై 26/11 సంఘటన ఆధారంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. 26/11 ముంబై టెర్రర్ అటాక్‌లో అమరవీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈసినిమాను తీశారు. ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్లతో పాటు సయీ మంజ్రేకర్ కూడా మరో కథానాయికగా నటిస్తుంది. ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్ హోమ్ బేనర్ జీఎంబీ ప్రొడక్షన్స్ సోనీ పిక్చర్స్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, మలయాళంలో కూడా రిలీజ్ చేయనున్నారు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: