టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టనున్నాడు. ఇన్ని రోజులు ఆర్ఆర్ఆర్ సినిమాతోనే బిజీగా ఉన్నాడు చరణ్. మరి రాజమౌళి సినిమా అంటే తెలిసిందే కదా. తన సినిమా చేస్తున్నప్పుడు వేరే సినిమా చేయడానికి వీలుండదు. అందుకే ఎన్టీఆర్ – చరణ్ కూడా ఈ ప్రాజెక్ట్ కే లాక్ అయిపోయారు. ఎన్టీఆర్ అయితే ఇప్పటివరకూ మరే కొత్త సినిమాను ప్రారంభించలేదు. చరణ్ మాత్రం ఆర్ఆర్ఆర్ షూటింగ్ అయిపోయినతరువాత ఆ గ్యాప్ లో శంకర్ సినిమాను స్టార్ట్ చేసేశాడు. కొంతవరకూ షూటింగ్ కూడా పూర్తయింది. అయితే మళ్లీ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ వల్ల షూటింగ్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. కానీ కరోనా థర్డ్ వేవ్ వల్ల సినిమా రిలీజ్ వాయిదా పడింది. దీంతో చరణ్ తన నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం చరణ్ శంకర్ సినిమా చేస్తున్నాడు. ఇంకా గత కొంతకాలంగా రామ్ చరణ్-గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా రాబోతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇటీవలే ఇచ్చేశారు. యు.వి.క్రియేషన్స్, ఎన్‌వి.ఆర్ సినిమా పతాకాలపై సినిమా రూపొందనుంది.
ఇదిలాఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. మరో యంగ్ డైరెక్టర్ కు చరణ్ ఛాన్స్ ఇవ్వనున్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. రీసెంట్ గా నాని తో శ్యామ్ సింగరాయ్ సినిమా తీసి హిట్ కొట్టిన రాహుల్ సంకృత్యన్. ఈసినిమాను చూసిన చరణ్ ఇటీవలే తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఈవార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు రాహుల్ చరణ్ కు ఒక కథను వినిపించగా అది చరణ్ కు కూడా నచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: