కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ 2022 ఫిబ్రవరి 4 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.“ఆచార్య “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , లాహే లాహే , నీలాంబరి సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా చిత్ర యూనిట్ మెగాస్టార్ చిరంజీవి , రెజీనా స్పెషల్ సాంగ్ “శానా కష్టం”ను రిలీజ్ చేసింది. ఆ సాంగ్ లో చిరంజీవి , రెజీనా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. “శానా కష్టం” సాంగ్ కేవలం 14 గంటల్లోనే 7.3 మిలియన్ భారీ వ్యూస్ అందుకుంది. ఇక అలాగే 2 లక్షలకు పైగా లైక్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. “ఆచార్య “మూవీ పై ప్రేక్షక , అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ “చూడాలని ఉంది” , “ఇంద్ర “, “బావగారు బాగున్నారా” వంటి మూవీస్ లో పలు సూపర్ హిట్ సాంగ్స్ ను సంగీత దర్శకుడు మణిశర్మ కంపోజ్ చేసిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: