డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అల్లూరి సీతారామరాజు , ఎన్టీఆర్ కొమరం భీమ్ గానూ నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. “రౌద్రం రణం రుధిరం ” మూవీ నుండి రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“రౌద్రం రణం రుధిరం “మూవీ ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ భారిగా చేపట్టింది. తాజాగా చెన్నై లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర యూనిట్ అభిమానుల సమక్షం లో గ్రాండ్ గా జరిపింది. ఆ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ .. “RRR” విషయంలో తాను చాలా మందికి థాంక్స్ చెప్పుకోవాలనీ , ముందుగా తనపై నమ్మకంతో ఇంత మంచి సినిమాలో తనను భాగం చేసినందుకు మా జక్కన్నకు ధన్యవాదాలనీ , సినిమా పరంగా మన దగ్గర ఉన్న ప్రాంతీయ సినిమా అనే సరిహద్దులను ఆయన చెరిపేస్తున్నారనీ , పాన్ ఇండియా సినిమా అనే భావనను తీసుకొస్తున్నారనీ , అంతే కాదు.. ఈ సినిమాతో తెలుగు సినిమాలో ఉన్న ఇద్దరు స్టార్స్ కలిసి నటించే అందమైన అనుభూతిని మళ్లీ వెండితెరపై చూపించబోతున్నారనీ , అలాంటి సినిమా చూసి చాలా రోజులు అవుతుందనీ , ఇప్పుడు రాజమౌళిగారు అలాంటి సినిమా చేశారనీ , .అందరూ RRR సినిమా దయచేసి థియేటర్స్‌లోనే చూడండనీ ,తన బ్రదర్ రామ్ చరణ్‌తో “RRR”లోని ప్రతి షాట్‌ను మళ్లీ చేయాలనుకుంటున్నాననీ , అందుకు కారణం అతనితో తాను టైమ్ స్పెండ్ చేసే అవకాశం దక్కుతుందనీ , ఇది ప్రారంభం మాత్రమే ముగింపు కాదనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: