శ్రీ విష్ణు సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకు కొంత పాజిటివిటీ ఉంటుంది. ఎందుకంటే మొదటినుండి అతను ఎంచుకునే సినిమాలు, వేసే పాత్రలు కాస్త డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి. ఇటీవలే రాజ రాజ చోర సినిమాతో హిట్ కొట్టినశ్రీవిష్ణు ఇప్పుడు ఎడాది చివర్లో అర్జున ఫల్గుణ సినిమాతో వస్తున్నాడు. తేజ మార్ని దర్శకత్వంలో శ్రీ విష్ణు హీరోగా, అమృత అయ్యర్ హీరోయిన్‌గా వస్తున్న సినిమా అర్జున ఫల్గుణ. మరో రెండురోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో శ్రీ విష్ణు ఎన్టీఆర్ ఫ్యాన్ గా నటిస్తున్నాడని ఇప్పటికే తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీవిష్ణు ఎన్టీఆర్ ఫ్యాన్స్ గురించి చెబుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఈసినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మా షూటింగ్ ప్లేస్ కు వచ్చి మాకు ఏమైనా కావాలా అని అడిగి.. వారి సొంత డబ్బులతో పెద్ద కటౌట్ ను చేసి ఇచ్చారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఈసినిమా ఫీస్ట్ లా ఉంటుంది అంటూ చెప్పారు.
కాగా ఈసినిమాలో నరేష్, శివాజీ రాజా, సుబ్బ రాజు, దేవీ ప్రసాద్, రంగస్థలం మహేష్, రాజ్ కుమార్ చౌదరి, చైతన్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ సంగీతం అందిస్తుండగా.. జగదీష్ సినిమాటోగ్రఫి అందించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: